జనసేన పార్టీలోకి వైసీపీ నుండి దళిత సోదరులు చేరికలు

  • పార్టీ కండువాకప్పి ఆహ్వానం పలికిన ఇంచార్జి మాకినీడి శేషుకుమారి.

కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం నరసింగాపురం గ్రామంలో కొంగు పృథ్వికర్ ఆధ్వర్యంలో వైయస్సార్ కాంగ్రెస్ నుంచి 20 మంది దళిత సోదరులు, ఇతర నాయకులు పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి సమక్షంలో జనసేన పార్టీ లోకి జాయిన్ అవ్వడం జరిగింది. వారికి జనసేన ఇంచార్జ్ శేషుకుమారి కండువాకప్పి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పృథ్వి మాట్లాడుతూ. ఎన్నో ఏళ్లుగా ఎస్సీ రిజర్వేషన్ లకు పోరాడి తెచ్చుకుంటే ఈ ప్రభుత్వం వచ్చాక అవన్నీ రద్దు చేయడం జరిగింది. మాకు జనసేన పార్టీ అండగా నిలబడుతుందని అనే నమ్మకంతో ఆ నమ్మకం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు నిలబెట్టడమే కాదు ప్రమాదవశాత్తు మరణించిన జన సైనికులకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చి, ఆ కుటుంబానికి అండగా పెద్ద అన్నల ఉన్న ఆయన వ్యక్తిత్వం నచ్చి అంబేద్కర్ విగ్రహం దగ్గర పార్టీలోకి చేరటం ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ సిద్దంతాలు ఆశయసాదనకు ఆకర్షణీయులై పార్టీలో చేరికకు కారణమయిందని, అలాగే శేషుకుమారి అడుగుల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ శేషుకుమారి మాట్లాడుతూ జనసైనికులు ఆహ్వానం మేరకు వరసిద్ధి వినాయక మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకునే, అలాగే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి పూలమాలవేసి జై భీమ్ చెపుతూ పిఠాపురం నియోజకవర్గ ప్రజలు జనసేన పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారని, ఇప్పటికే పలుఉవ్రు పార్టీలోకి ఉత్సాహంతో రావటం చాలా ఆనందంగా ఉందని, మత ప్రస్థానం లేని రాజకీయం అన్ని కులాల్ని కలుపుకొని నడిచే పార్టీ జనసేన పార్టీ అన్ని, మీ గ్రామ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తుందని, మీ అందరికీ అండగా ఉంటానని ఆమె హామీచ్చారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మాకినీడి వీరప్రసాద్, గోపు సురేష్, పుణ్య మంతుల మూర్తి, మండల అధ్యక్షులు అమరాది వల్లి, మండల గౌరవ అధ్యక్షులు సలాది సుబ్బారావు, ఒలేటి సాయి రెడ్డి, పృథ్వీకర్, మాజీ కౌన్సిలర్ కర్రీ కాశీ విశ్వనాథ్, కాళ్ల రాజు, భీమరాజు, దేశిరెడ్డి సతీష్, కంద సోమరాజు, మంజూరు చిన్నయ్య మంజూరు ప్రతాప్, మంజూరు పృథ్వీరాజు, సలాది బాబ్జి, పంచాయతీ మధు, మోతుమధు, పంచాయతీ సాయి, కోన రాంబాబు, రాయుడు రాజు, నూకరాజు, మణికంఠ, ధూళిపూడి శ్రీధర్, రాయుడు రాజు, చింతపల్లి రాంబాబు, ఒలేటి మణికంఠ రెడ్డి, కాళ్ల రాజు, భీమరాజు, దొడ్డి దుర్గాప్రసాద్, పెనిపోతుల నాని బాబు, స్వామిరెడ్డి అంజి, సూరడా శ్రీను, పిరముళ్ళ ప్రసాద్, శివారెడ్డి, కసిరెడ్డి నాగేశ్వరరావు, పబ్బినీడి దుర్గాప్రసాద్ నామ శ్రీకాంత్, నామ సాయి, జనసైనికులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.