కాపులను నిర్లక్ష్య వైఖరిలో చూస్తూ.. వారికి ద్రోహం చేస్తున్న బొత్స తీరును ఖండించిన దారం అనిత

జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత మాట్లాడుతూ అమరావతి రైతుల పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. ఎక్కడికి వెళ్లినా స్వాగత సత్కారాలు పూల వర్షాలు కురిపిస్తున్నారు. అలుపెరుగని వారి పోరాటంలో ప్రజలంతా కలిసి నడుస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఒక వైసీపీ పార్టీ తప్ప ఆ పార్టీతో పని ఉన్న వారు తప్ప ప్రభుత్వంతో ఏమైనా లబ్ధి ఉంటుందని అనుకునేవారు తప్ప.. మిగతా అందరూ మద్దతిస్తున్నారు. కానీ ఇప్పుడు వైసీపీ మంత్రులు మాత్రం ఉన్నట్టుండి నోరు పారేసుకుంటున్నారు ఒకవేళ మూడు రాజధానులు కావాలనుకుంటే కోర్టు ఏమి చెప్పింది అర్థం చేసుకోండి. బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర పై దండయాత్ర అంటారు. కమ్మరావతి అంటారు. అసలు ఈయన ఒక మంత్రి సీనియర్ మంత్రి గా ఉండి.. ఇంత సీనియర్ నాయకుడిగా ఎలా ఎదిగాడో మనందరం చూసాం. మరి ఇప్పుడు కేవలం జగన్మోహన్ రెడ్డి ఇచ్చే ఈ చిన్న మంత్రి పదవి కోసం ఇతని అనుభవాన్ని మొత్తం ముఖ్యమంత్రి పాదాల వద్ద తాకట్టు పెట్టేశారు. మీరు మూడు రాజధానులు అంటే ఊరుకోం అంటున్నారు. ఏం చేస్తారు న్యాయమూర్తుల పైన కేసులు వేస్తారా లేదా న్యాయమూర్తులు అరెస్ట్ చేయమని పోలీసు కి ముందుగానే చెప్పారా.. ఏం చేస్తారు..? సార్ ఒకసారి టచ్ చేయండి.. టచ్ చేసి చూడండి.. ఊరికే మాట్లాడటం కాదు. సార్ మీరు ఒక మంత్రి అందులో సీనియర్ మంత్రి ఉమ్మడి రాష్ట్రాలకు ముఖ్య మంత్రి అర్హత ఉన్న మంత్రి మీరు.. అదేవిధంగా సోమవారం జరిగిన కాపు సమావేశానికి వైఎస్ఆర్సిపి తరఫున హాజరైన మంత్రుల్లో మీరు ఉన్నారు. ఒక కాపు అయి ఉండి కూడా కాపులను నిర్లక్ష్య వైఖరిలో చూస్తూ.. ఒక పక్క ద్రోహం చేస్తూ.. కాపులకి మరోవైపు కాపులకి మేము ఇది చేస్తాం, అది చేస్తామని చిలక పలుకులు పలుకుతున్నారు. ఇది మీకు తగదు.. మీరు ఇలా మాట్లాడటం మీకు అవసరమా..? ఇప్పటికైనా మీరు ఒక మంత్రి అని గుర్తుపెట్టుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడేటప్పుడు మీరు ఒక కాపు అని గుర్తు పెట్టుకొని మాట్లాడితే బాగుంటుందని జనసేన పార్టీ తరపున తెలియజేయడం జరిగింది.