రాజంపేట జనసేన-టిడిపి ఆధ్వర్యంలో గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

రాజంపేట జనసేన-టిడిపి సమన్వయ బాద్యులు అతికారి దినేష్ ఆధ్వర్యంలో ఇసుకపల్లి రోడ్డులోని, మరియు వీరబల్లి టౌన్ నందు, గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అతికారి దినేష్ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గత సంవత్సరంలో మా అధినేత పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు హలో ఏపీ అనే కార్యక్రమంలో ద్వారా డీజిటల్ క్యాంపెయిన్ నిర్వహించడం జరిగిందని, రాజంపేట నియోజకవర్గంలోని ఆధ్వాన పరిస్థితుల్లో ఉన్నటువంటి రోడ్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి మేము ఈ డిజిటల్ క్యాంపెయిన్ ద్వారా తీసుకువెళ్ళడం జరిగిందని, ఈ సంవత్సరం పాటు రాష్ట్ర అభివృద్ధిపై రాష్ట్ర ప్రజలపై ఏమాత్రం చిత్తశుద్ధిలేని ఈ ప్రభుత్వమని మరోసారి రుజువైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం వీరబల్లి మండల ఇంచార్జ్ బానుగోపాల్ రాజు, జిల్లా తెలుగు యువత కార్యదర్శి నేతి రమేష్, జనసేన పార్టీ నాయకులు పండ్రా రంజిత్ కుమార్, కోలటం హరికృష్ణ, గురు, కోట్టే శ్రీహరి, గుగ్గీళ్ళ నాగార్జున, ముత్యాల చలపతి, అబ్బిగారి గోపాల్, మస్తాన్, మల్లికార్జున, మురళి, రత్నం, సాయి, రాము, అనిల్, చిన్నా, తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.