ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  • విశాఖ దక్షిణ నియోజకవర్గంలో పలుచోట్ల సేవా కార్యక్రమాలు చేపట్టిన: కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు కందుల నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. స్థానిక సింహాలా దేవుడు కూడలి మరియు డి.ఆర్.ఎమ్ కార్యాలయం వెనక ఉన్న రైల్వే క్వార్టర్స్ లో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనముగా నిర్వహించారు. స్థానిక ప్రజలు, నాయకులు, కార్యకర్తలు సమక్షంలో కేక్ కట్ చేసి అభిమాన నాయకుడికి శుభాకాంక్షలు తెలియజేసారు. భవన నిర్మాణ కార్మికులు అలాగే రెల్లి కులస్తులతో కలిసి సహపంక్తి అల్పాహారం తీసుకున్నారు. ఈ సందర్బంగా కందుల నాగరాజు మాట్లాడుతూ నేడు ప్రజలనేత, కాబోయే ముఖ్యమంత్రి అయిన జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. నిత్యం ప్రజలకోసం తపించి, ఆలోచించి, వాళ్ళ కష్టాలని తీర్చే పవన్ కళ్యాణ్ ని ఈసారి గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరారు. భవన నిర్మాణ కార్మికులకు 60 ఏళ్ళ వరకు పని చేయనవసరం లేకుండా 50 ఏళ్ళకే రిటైర్మెంట్ ఇచ్చి ఆ తరవాత నెలకి 5000 పెన్షన్ ఇచ్చే ఆలోచనలో జనసేనాని ఆలోచన చేస్తున్నారని, అలాగే రేషన్ సరుకులకు బదులు 3000 ఇస్తామని ఇప్పటికీ పవన్ చెప్పరని తెలియజేసారు. 500, 1000 కి తమ ఓటు అమ్ముకోవద్దని, ఎంతో విలువైన ఓటుతో మంచి భవిష్యత్తుని నిర్మించుకుదామని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేసేరు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వసంతలక్ష్మి, గోపికృష్ణ, ప్రణీత్, అరుణ్, రఘు, త్రినాథ్, రాజు,నరేంద్ర, రూప, త్రినాధ్, జోగి, శ్రీహరి,వరలక్ష్మి, భవన కార్మికుల సంఘం అధ్యక్షులు సత్తిబాబు, గుర్నాథ్ మరియు పెద్ద ఎత్తున జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.