మానవత్వం చాటిన దాసరి రాజు

ఇచ్చాపురం, ఆదివారం రాత్రి అనగా 3.7.2022 ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి గ్రామం సర్వీస్ రోడ్డులో సుమారు రాత్రి 7 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఒక ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డు ప్రమాదం సంభవించింది ఈ ప్రమాదంలో ఇచ్చాపురం మండలం ధర్మపురం గ్రామానికి చెందిన 48 ఏళ్ల వ్యక్తి తీవ్రంగా గాయాలు పాలయ్యారు. సరిగ్గా అదే సమయానికి ఇచ్చాపురం జనసేన సమన్వయకర్త దాసరి రాజు పార్టీ కార్యక్రమాలు ముగించుకొని పాలకొండ నుంచి తిరిగి వస్తూ రోడ్డు ప్రక్కనే జరిగిన సంఘటనను చూసి, సంఘటన స్థలానికి చేరుకుని వెంటనే 108 వాహనంకు కాల్ చేశారు. 108 వాహనం ఎంతకీ రాకపోవడాన్ని గమనించిన రాజు తన కారులో రక్తస్రావంతో పడి ఉన్న బాధితుడిని స్థానికుల సహాయంతో ఇచ్చాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆసుపత్రిలో డాక్టర్స్ లేకపోయినప్పటికీ సిబ్బందిని అప్రమత్తం చేసి వెంటనే ప్రథమ చికిత్స చేయించారు. ఆసుపత్రి సిబ్బంది వెంటనే బరంపురం ఆసుపత్రికి తీసుకొని వెళ్ళమని సూచించడంతో, సమయానికి 108 అందుబాటులో లేకపోవడంతో అద్దె కారు తెప్పించి బాధితుడిని బరంపురం ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఇచ్చాపురం ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్స్ లేకపోవడంతో ఆగ్రహానికి గురైన దాసరి రాజు సిబ్బందిని నిలదీశారు. ఇలా దాసరి రాజు వెంటనే స్పందించిన తీరు మరియు ఆయన చూపిన సేవగుణం చూసి చుట్టుప్రక్కల ఉన్నవారు రాజు సేవా గుణాన్ని కొనియాడారు. దాసరి రాజు నాయకుడా లేదా సేవకుడా అన్న ఆలోచన అందరి మదిలోన మెదులుతుంది. ఇటువంటి సేవా గుణం కలిగిన నాయకుడిగా దాసరి రాజు గారిని అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.