బీ.టీ కాలేజీలో పోస్టులు నిర్వీర్యమైపోతున్నాయి

  • జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం

మదనపల్లె నియోజకవర్గం: మదనపల్లె బీ.టీ.కళాశాల ప్రైవేటుదా..?, ప్రభుత్వానిదా..? సందేహాలపై ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డినీ జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్ దాస్ చౌదరి ఆధ్వర్యంలో జనసేన నాయకులు కార్యకర్తలతో కలసి కళాశాల స్థితి గతులపై చర్చించి బిటీ కళాశాల ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా గంగారపు రాందాస్ చౌదరి మాట్లాడుతూ.. నిర్వీర్యం అయిపోతున్న బీటీ కళాశాలని కాపాడాలని ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్, జనసేన పార్టీ ఏ.ఐ.ఎస్.ఎఫ్, బి.ఎస్.పి అన్ని పార్టీలు కలిసి కాలేజీ క్షేమంగా ఉండాలని అనేక సంవత్సరాలు పోరాటం చేస్తే మొన్న స్థానిక ఎమ్మెల్యే ఎంపీ గారు హడావిడిగా కాలేజీని ప్రభుత్వ పరం చేసేసామని చెప్పడంతో ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ పార్టీలకు అతీతంగా అభినందనలు కూడా తెలియజేయడం జరిగింది. తర్వాత బీటీ కాలేజ్ ప్రభుత్వ పరం చేయడం కాకుండా యూనివర్సిటీ కూడా చేయడం జరిగింది అని చెప్పారు. ఏ ఆధారం లేకుండా ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. తీరా నోటిఫికేషన్ చూస్తే ఏపీ లో 1072 కాలేజీల లిస్ట్ లో వేకెన్సీస్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం బీటీ కాలేజ్ పేరు లేకపోవడం గమనార్హం. దీనికి సంబంధించి బిటీ కళాశాల ప్రిన్సిపల్ గారిని వివరణ కోరితే లెటర్ పంపించేశాము అప్లికేషన్ పెట్టాము కోడ్ రాలేదు అన్నారు. కానీ ఈ నిర్లక్ష్యం ప్రభుత్వం వలన కాలేజీలో పోస్టులు నిర్వీర్యమైపోతున్నాయి అని దీనిని జనసేన ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తుందని అన్నారు. ఈ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని పక్కనపెట్టి ఈ కాలేజీకి న్యాయం చేయాలని కాలేజీ ఆస్తులని ప్రభుత్వ పరం చేయాలని ఖాళీగా ఉన్న 78 టీచింగ్, 38నాన్ టీచింగ్ స్టాఫ్ ని భర్తీ చేయాలని లేని పక్షంలో దీనికోసం ఎంతవరకైనా వెళ్తామని అనిబిసెంట్ తల్లి బిడ్డలుగా తెలియజేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, ఐటీ విభాగ నాయకులు జగదీష్, రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, గడ్డం లక్ష్మిపతి, గౌతమ్, రెడ్డెమ్మ, అంజలి, కుమార్, నాగ, మోహన, గండి కోట లోకేష్, నవాజ్, లవన్న, ఆంజనేయ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.