బెంతో ఒరియాల నిరసనకు మద్దతు తెలిపిన దాసరి రాజు

  • ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు

ఇచ్చాపురం నియోజకవర్గం: దశాబ్దాల కాలంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాల్లో నివాసం ఉంటున్న బెంతో ఒరియా కులస్తులకు కుల ధృవీకరణ పత్రం లేక వారికి జరుగుతున్న అన్యాయంపై మంగళవారం ఇచ్ఛాపురంలో బెంతో ఒరియా కులస్తులు శాంతియుతంగా చేసిన నిరసన కార్యక్రమంలో ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు పాల్గొని వారి న్యాయబద్ధమైన డిమాండ్లతో చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపారు. కొన్ని ఏళ్లుగా బెంతో ఒరియాలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అని, విద్యార్ధులు కులదృవీకరణ పత్రం లేక పైచదువులు చదవలేక ఇంటికే పరిమితం అవుతున్నారని, అలాగే ఉద్యోగాలకు దరఖాస్తులు చేయాలన్నా కుల ధృవీకరణ పత్రం తప్పని సరి అని, వెంటనే ప్రభుత్వాలు ఈ సమస్య పరిష్కారం చేయాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేశారు. అలాగే జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా వివిధ సందర్భాల్లో బెంతో ఒరియాల సమస్యల పట్ల మాట్లాడిన విషయము గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో 10వ వార్డు ఇంచార్జ్ ఒక్కళ్ళ భాస్కరరావు, దాసరి అజయ్ కుమార్, కల్ల కామేష్, కల్య గౌడు పాల్గొన్నారు.