జనసేన ప్రజా చైతన్య యాత్ర 33వ రోజు

బొబ్బిలి: జనసేన ప్రజా చైతన్య యాత్రలో 33వ రోజు కార్యక్రమంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గ ఇన్చార్జ్ గిరడ అప్పలస్వామి ఆధ్వర్యంలో తెర్లం మండలం, రంగపువలస పంచాయతీలోని తమయ్యవలస గ్రామంలో గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు ఇంటింటా పర్యటించి సమస్యలు తెలుసుకుని వాటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉల్లి సంతోష్, పాండ్రంగి అప్పారావు, పాండ్రంగి జయప్రకాశ్, మురళి, సింధు, అప్పలస్వామి మరియు తెర్లం మండల జనసైనికులు పాల్గొనడం జరిగింది.