జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 5వ రోజు

పాలకొండ నియోజకవర్గం సీతంపేట మండలం రామనగరం గ్రామంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కూరంగి నాగేశ్వరరావు (ఎస్.బి.ఐ రిటైర్డ్ మేనేజర్) జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 5వ రోజు రామనగరం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని, త్వరలోనే వైఎస్ఆర్సిపికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారని, నాగేశ్వరరావు అన్నారు. జనసేన తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ సమస్యలను పరిష్కరించే బాధ్యత నాది అని కూరంగి నాగేశ్వరరావు తెలియజేశారు. స్థానిక నాయకులు సుందరరావు, పవన్, సీతంపేట మండల అధ్యక్షులు మండంగి విశ్వనాథం, పాలకొండ మండల జనసేన నాయకులు డొంపాక సాయి కుమార్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.