రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో భవాని రవి కుమార్ పుట్టినరోజు వేడుకలు

కదిరి, అఖిల భారత రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ప్రధాన కార్యదర్శి పి భవాని రవి కుమార్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ యువ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మాధవ గురుకులంలో ఉండే నిరాశ్రిత పిల్లలకు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. భవాని రవి కుమార్ రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలని శ్రీ మద్ కదిరి లక్ష్మి నరసింహ స్వామిని ప్రార్థిస్తున్నామన్నారు.