డ్రగ్స్ కేసు సున్నితమైన రీతిలో డీల్‌ చేయాలి: అక్షయ్ కుమార్

సుశాంత్ రాజపుత్ మరణం తరవాత డ్రగ్స్ కోణం వెలుగులోకి వచ్చింది. దాంతో ఎన్సీబీ అధికారులు తీగ లాగడంతో అన్నీ ఇండస్ట్రీల డొంకలు కదులుతున్నాయి. డ్రగ్స్ కేసులో ఇప్పటికే నలుగురు హీరోయిన్లను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు విషయం తెలిసిందే. ఇప్పటికే రియా చక్రవర్తిని అరెస్ట్ చేశారు ఎన్సీబీ అదికారులు. ఆమెను విచారిస్తున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్లు దీపికాపదుకొనే, సారా అలీ ఖాన్, శ్రద్ధాకపూర్, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు బయటకు రావడంతో ఈ నలుగురిని విచారించింది ఎన్సీబీ. ఈ విచారణలో హీరోయిన్లు తమకు డ్రగ్స్ తో సంబంధం లేదు అని చెప్పినప్పటికీ ఎన్సీబీ అధికారులు వదలకుండా విచారణ చేస్తూనే ఉన్నారు. తాజాగా బాలీవుడ్ పై రకరకాల విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టార్ హీరో అక్షయ్ కుమార్ స్పందించారు. చాలా రోజులుగా ఏదో చెప్పాలనుకుంటున్నాను.. ఎవరితో చెప్పాలో.. ఏమి చెప్పాలో తెలియడం లేదని ఆయన ఓ వీడియోను షేర్ చేసారు.

ఈ వీడియో అక్షయ్ మాట్లాడుతూ .. మీడియా శక్తిని తాను ఎలా విశ్వసిస్తున్నానో అని చెప్పిన అక్షయ్ కుమార్.. వారు తమ గొంతును కొనసాగించాలని కోరుకుంటున్నానని, అయితే ఒక సున్నితమైన వార్త ఒకరి కెరీర్ మొత్తాన్ని నాశనం చేయగలదని, సున్నితమైన రీతిలో దీన్ని డీల్‌ చేయాలని కోరారు. “డ్రగ్స్ ఒక చట్టపరమైన విషయం. సినిమా పరిశ్రమ పై కొందరికి సరైన అభిప్రాయం లేదు. త్వరలోనే వారు నిజాలు తెలుసుకుంటారని భావిస్తున్నాను. కొందరి కారణంగా మొత్తం పరిశ్రమను ప్రతికూల ఉద్దేశంతో చూడవద్దని వేడుకుంటున్నాను” అని చెప్పుకొచ్చారు అక్షయ్.