ఆగని ఆశ్రమ విద్యార్థి-విద్యార్థినిల మరణాలు

  • ఆశ్రమ విద్యార్థిని ఆకాలమరణం
  • స్పందించని ప్రభుత్వం
  • డా. వంపూరు గంగులయ్య జనసేన పార్టీ పాడేరు. (అరకు పార్లమెంట్ జనసేన పార్టీ ఇన్చార్జ్)

పాడేరు: చింతపల్లి మండలం, రింతడ ఆశ్రమ పాఠశాలలో 5వ క్లాస్ చదువుకుంటున్న జి.మాడుగుల మండలం దేవరపల్లి గ్రామానికి చెందిన వంతల దీవెన గత వారం క్రితం అస్వస్థతతో బాధపడుతుందని పాఠశాల యాజమాన్యం తల్లితండ్రులకు కబురు చేశారు. వెంటనే దీవెనని గ్రామనికి తీసుకొచ్చి చికిత్స కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించక ముందే ఆమె మరణించింది. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నాయకులు ఆ పార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య ఆమె అంతక్రియలకు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మేము ఖచ్చితంగా ఈ మరణం సహజ మరణంగా బావించట్లేదు? ఇది స్వయంగా ప్రభుత్వం చేసిన హత్యలు? ఇలాంటివి జిల్లా వ్యాప్తంగా ఎందరో విద్యార్థులు ఇలా అకారణంగా మృతిచెందడం గత కొంతకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన నుంచి ఇటువంటి మరణాలు ఎక్కువయ్యింది కారణాలు స్పష్టంగా తెలుస్తోంది గతంలో ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు ఆరోగ్యానికి సంబంధించిన సమగ్ర ఆరోగ్య విషయాలు పర్యవేక్షించడానికి ఆరోగ్య కార్యకర్తలు నిరంతరం శ్రమిస్తూ సేవ చేసే వారు. ప్రస్తుత ప్రభుత్వం వాళ్ళని తొలగించి వారి పొట్టకొట్టడమే గాకుండా విద్యార్థుల ప్రాణాలను బలితీసుకుంటుంది. ఇంకెంత మంది ఇలా మరణించాలి మన అధివాసిలపిల్లలంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపా?ఈ ప్రబుత్వాలకి, కనీసం ప్రజాప్రతినిధులకి కించిత్తూ చలనం లేదా? ఇలా మరణిస్తున్న కూడా మనం మేల్కొలేమా? ఇది ఖచ్చితంగా ప్రభుత్వం తమ స్వలాభం కోసం వ్యూహాత్మక హత్యల ఎత్తుగడ అనుకోవాలి. వారి రాజకీయ లబ్ధికోసం మన భవిష్యత్ తరాలు నేల రాలిపోవాల? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి సమాధానం చెప్తారు? స్థానిక ఎమ్మెల్యే,ఎంపీ ఏ సమాదానం చెప్తారు?. వారి రాజకీయాలు బానిసత్వానికి నకలు! అందుకే మన బ్రతుకులు ఇలా తగలబెడుతున్నారన్నారు.అభం శుభం తెలియని వంతల దీవెన అంతక్రియలు కేవలం ఆమె మరణానికి అంతక్రియలుగా మేము బావించలేము? ప్రభుత్వాలు ఆదివాసీ ప్రజల భవిష్యత్ తరాలపై చేసే హత్యాకాండ గా బావిస్తున్నామన్నారు. ఈ అంతక్రియాల్లో లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, తాంగుల రమేష్, భానుప్రసాద్, సుర్ల సుమన్, మజ్జి నగేష్, తదితరులు పాల్గొని ఆమెకు నివాళులు అర్పించారు.