అభిమానులను సేవాస్ఫూర్తితో నడిపించే దీపం చిరంజీవి: గురాన అయ్యలు

  • అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాల్తేరు వీరయ్య విజయోత్సవం – వరుణ్ తేజ్ పుట్టినరోజు వేడుకలు

విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీపుత్ర చిరంజీవి ప్రజా సేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య విజయోత్సవ సంబరాలను మరియు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ జన్మదిన వేడుకలు స్థానిక ఎన్.సి.ఎస్ థియేటర్ లో జిల్లా చిరంజీవి యువత కార్యదర్శి పిడుగు సతీష్, అంజనీ పుత్ర చిరంజీవి సంఘం అధ్యక్షుడు కోయ్యాన లక్ష్మణ యాదవ్, కార్యదర్శి లోపింటి కళ్యాణ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా జనసేన పార్టీ నాయకులు గురాన అయ్యులు, ఆదాడ మోహన్ రావు, జనసేన ఉత్తరాంధ్ర వీరమహిళా కో ఆర్డనేటర్ తుమ్మి లక్ష్మీ రాజ్, థియేటర్ మేనేజర్ శ్రీను హాజరయ్యారు. ఈ సందర్భంగా మీడియాతో జనసేన నాయకులు గురాన అయ్యలు మాట్లాడుతూ మెగాభిమానులకు సేవా స్ఫూర్తిని నింపి, తాను ఎంచుకున్న సేవా మార్గంలో రక్తదానం, నేత్రదానం, అనేక సేవలు చేస్తూ, ఆపదలో ఉన్న అభిమానులకు,సినీ పరిశ్రమలో ఉన్న తోటి నటీనటులకు, సినీ కార్మికులకు ఆర్థికంగా ఆదుకుంటూ సినీ పరిశ్రమకు పెద్దదిక్కుగా, ఆపంద్భాందువుడుగా చిరంజీవి వ్యవహరిస్తున్నారని, మెగా బ్రదర్స్ చేస్తున్న నిస్వార్థ సేవలకు ప్రజల్లో ఆదరణ చూడలేక కొందరు వైసీపీ అజ్ఞానులు చిరంజీవి, వారి కుటుంబ సభ్యులపై అవాక్కులు, చవాకులు వాగుతుంటారని వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని, మెగాభిమానులను సేవాస్పూర్తిని నింపి నడిపించే దీపం చిరంజీవి అని కొనియాడారు. జనసేన నాయకులు ఆదాడ మోహనరావు, నాయకురాలు తుమ్మి లక్ష్మిరాజ్ మాట్లాడుతూ మెగాభిమానులు ఎప్పుడూ సేవల్లో ముందుంటారనీ, చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అహిర్నిశలు పాటుపడతారని అన్నారు. మెగాభిమానులు స్వీట్లు పంచిపెట్టీ, బాణాసంచా కాల్చి వేడుకల్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన నాయకులు, జనసేన నాయకులు తుమ్మి అప్పలరాజు దొర, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు డోలా రాజేంద్ర్రసాద్, పార్టీ సీనయర్ నాయకులు, జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు), యువనాయకులు బాబు, యాతపేట రవి, గాజులరేగ వాసు, కందివలస సురేష్, సూరిబాబు, అప్పన్న, రాజు,కులదీప్ తదితరులు పాల్గొన్నారు.