ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ

ఐపీఎల్ టీ20 ఫైనల్ మ్యాచ్ లో దుబాయ్ వేదికగా ముంబై×ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ బ్యాటింగ్‌ ఎంచుకుంది. కాగా, ఇప్పటికే నాలుగుసార్లు టైటిల్ సాధించిన ముంబై… మరోసారి ట్రోఫీ మీద కన్నేయగా, తొలిసారి ఫైనల్‌కు చేరిన ఢిల్లీ… ఎట్టి పరిస్థితుల్లోనూ కప్‌ను చేజిక్కించుకోవాలనే పట్టుదలతో బరిలోకి దిగింది. ఫైనల్ ఫైట్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్‌ పోరాడే స్కోరు చేసింది. ముంబై ఇండియన్స్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్(65 నాటౌట్‌: 50 బంతుల్లో 6ఫోర్లు, 2సిక్సర్లు), రిషబ్‌ పంత్‌(56: 38 బంతుల్లో 4ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించడంతో 20 ఓవర్లలో ఢిల్లీ 7 వికెట్లకు 156 పరుగులు చేసింది.