మడకం రవికి ఆధార్ కార్డ్ వచ్చే విధంగా చూడాలని జనసేన తరఫున డిమాండ్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం, కమలాపురం గ్రామపంచాయతీలోని చల్మన్ నగర్ గ్రామంలో మడకం రవి అనే గిరిజన యవకుడు ఉపాధి కోసం అని 10 సంవత్సరాల వయసులో వలస వెళ్ళడం జరిగింది వలస వెళ్లి ప్రమాదవ శాత్తు కాలు విరగడంతో చత్ర చికిత్స చేసి కాలులో స్టీల్ రాడ్స్ వేయడం జరిగింది. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది. తదుపరి చికిత్స కోసమని హాస్పిటల్ కి వెళ్లడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది ఆధార్ కార్డు తీసుకు వస్తేనే ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అని కరాకండిగా చెప్పడం తో యువకుడికి ఇంటికి రావడం జరిగింది ఇప్పటివరకు ఆధార్ కార్డు లేకపోవడంతో ట్రీట్మెంట్ ఆగిపోయింది ఆధార్ కార్డు కోసమని స్థానిక ఆధార్ సెంటర్ కు రెండుసార్లు అప్లై చేయడం జరిగింది అయినా కూడా ఆధార్ కార్డ్ ఇప్పటివరకు రాకపోవడం గమనార్హం ఈ విషయం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మరియు జిల్లా నాయకుల దృష్టికి రావడంతో తక్షణమే స్పందించి ఆధార్ మీసేవ సెంటర్ వద్దకు వెళ్లి అడగగా వారు ఆధార్ కాల్ సెంటర్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఆధార్ సెంటర్కు ఫోన్ చేయగా కాల్ సెంటర్ వాళ్ళు రిజెక్ట్ అయింది మళ్ళీ అప్లై చేయండి అని చెప్పడం జరిగింది. ఈ విషయంపై స్పందించిన మండల అధ్యక్షులు ఇప్పటివరకు నాలుగు సార్లు అప్లై చేయడం జరిగింది అయినా కూడా రిజెక్టు ఎందుకు అయినదని వారిని ప్రశ్నించగా వారు మరోసారి అప్లై చేయమని చెప్పడం జరిగింది. ఈ విధంగా మూడు నెలలు వరకు ఆ గిరిజన యువకుడు ఎదురు చూసినా కూడా ఫలితం లేకపోవడంతో ఆ యువకుడికి ట్రీట్మెంట్ ఆగిపోయి కాలు అద్వాన్న స్థితికి చేరుకున్నది దీనిపై జనసేన పార్టీ జిల్లా మరియు మండల నాయకులు యువకుడు స్థితిని చూసి ఆవేదన వ్యక్తం చేయడం . ఈ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని గిరిజన యువకుడికి ఆధార్ కార్డు ఇప్పించాలని ఆ యువకుడికి ఉచితంగా పూర్తి ట్రీట్మెంట్ చేయించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అలా చేయని పక్షంలో జనసేన పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టజరిగిందిర్ కార్యాలయం ముందు జనసేన పార్టీ తరఫున నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. గిరిజన యువకుడు ఆధార్ కార్డు రాదు అని మనస్థాపానికి గురై రెండుసార్లు బలవన్మరణానికి పాల్పడగా వారి తల్లి కుటుంబ సభ్యులు కాపాడడం జరిగింది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని సదరు వ్యక్తికి ఆధార్ కార్డ్ వచ్చే విధంగా చూడాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు గరిక రాంబాబు, గొల్ల వీరభద్రం, ములకలపల్లి మండల అధ్యక్షులు తాటికొండ ప్రవీణ్, మండల నాయకులు అలుగుల శ్రావణ్, వీర మహిళలు స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.