జనసేనానికి జడ్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్

  • అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్

గుంతకల్లు నియోజకవర్గం, గుంతకల్లు టౌన్, అధినేత పవన్ కళ్యాణ్ కి రెక్కీ జరగడానికి కారకలు ఎవరు? జనాలలో పవన్ కళ్యాణ్ కి వచ్చే ఆదరణ చూసి తట్టుకోలేని సన్నాసులు ఇలాంటి చిల్లర పనులు చేస్తున్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి. ఇటీవల వైజాగ్ లో జరిగిన ఘటన తర్వాత ఇటువంటి పరిణామం చూస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వంపైన అనుమానాలు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని మా అధినేత పవన్ కళ్యాణ్ కి ఏర్పాటు చేయాలని అదేవిధంగా సెక్యూరిటీ పెంచాలని, వారిపై కఠిన చర్యలు తీసుకుని సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మా అధినేతకి జరిగిన సంఘటనని దృష్టిలో పెట్టుకొని పూర్తిస్థాయిలో కట్టుదిట్టమైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని, కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ డిమాండ్ చేయడం జరిగింది.