రామతీర్థం కోదండ రాముడి విగ్రహం ద్వంసం

విజయనగరం జిల్లా నెలిమర్ల లో రామతీర్థం పుణ్యక్షేత్రం ఉంది. నిన్న రాత్రి కొంత మంది దుండగులు ఆలయంలోకి ప్రవేశించి గర్భ గుడి తలుపులు పగలగొట్టి అక్కడ ఉన్న శ్రీ రాముడి విగ్రహం తలను తొలగించి, మొండెంతో విగ్రహాన్ని ఎత్తుకెళ్లారు. ప్రదాన అర్చకుడు రోజువారీ స్వామి సేవలో భాగంగా ఉదయం గుడికి వెళ్ళి తలుపు తెరవగా ఒక్కసారిగా షాక్ కు గురైయ్యాడు. అర్చకుడు రాముడి విగ్రహంను ద్వంసం అయ్యినట్లుగా గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. ఈ విషయం తెలుసుకున్న జిల్లా ఎస్‌పి రాజకుమారి, పోలీసు సిబ్బంది, డాగ్ స్క్వాడ్, క్లుస్ టీమ్ తో ఆలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఎవరో కావాలనే విగ్రహాన్ని ద్వంసం చేసినట్లుగా ఆమె తెలిపింది. తక్షిణమే దర్యాప్తు జరిపించి నిందితులను కఠినంగా శిక్షిస్తాం అన్నారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ మంత్రులు ఎం‌ఎల్‌ఏ లు రామతీర్థం చేరుకున్నారు.

మంత్రి బెల్లాన చంద్రశేఖర్ మాట్లాడుతూ రాముడి విగ్రహాన్ని ధ్వంసం చేయడం దురదృష్టకరమన్నారు. ముఖ్యమంత్రి జగన్ త్వరలో జిల్లకు రాబోతున్నాడనే విషయం తెలుసుకొని ప్రభుత్వం కు ఎక్కడ మంచి పేరు వస్తుందని ఓర్వలేక రాజకీయ దుష్ట శక్తులు ఇలాంటి నీచమైన పనులకు పాలుపడుతున్నాయి అన్నారు.అలాగే ఈ దుశ్చర్యకు పాల్పడిన నిందితులను పట్టుకొని వెంటనే శిక్షించాలని పోలీసులను కోరాడు.రాముడి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా యధావిధిగా ప్రతిష్టింపజేసేందుకు అన్నీ చర్యలు తీసుకుంటాం అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *