ఆంధ్రా అభివృద్ధి – జనసేనతోనే సాధ్యం

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, ముత్తుకూరు మండలం, ఈదుల వారి పాలెంలో గడప గడపకు జనసేన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ నెల్లూరు జిల్లా కార్యదర్శి, ముత్తుకూరు మండల అధ్యక్షుడు మనుబోలు గణపతి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక గిరిజనులు జనసేన నాయకులతో మాట్లాడుతూ ఇటీవల ఏర్పాటు చేసిన డ్రైనేజ్ కాలువలో ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోవడం వలన ఆ కాలువలో విపరీతంగా దోమలు చేరి ఆ గిరిజన కాలనీలో విష జ్వరాలు సోకి ఆసుపత్రి పాలవుతున్నారని, వాలంటీర్ కి చెప్పినా, స్థానిక నాయకులకు చెప్పుకున్నా ఈ సమస్యను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు తాండ్ర శ్రీను, గంగాల తిరుమల తదితరులు పాల్గొన్నారు.