జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలి: శీలం బ్రహ్మయ్య

మైలవరం, స్థానిక జనసేనపార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి నూతన సంవత్సర నూతన జీవో నెంబర్ 1ని, ప్రతిపక్ష పార్టీలకు భయపడి ఎక్కడ ఈ ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేకతను ప్రజలు బలంగా వ్యక్తపరచడానికి అవకాశం ఉంది కాబట్టి, జీవో నెంబర్ 1ని తీసుకువచ్చి ప్రజాస్వామ్యంలో సభలు సమావేశాలు నిర్వహించుకోవడం షరా మామూలే అయినప్పటికీ, ఇటీవల జరిగిన కొన్ని దురదృష్టకర పరిణామాలను సాకుగా చూపిస్తూ, రోడ్ల పైన సభలు సమావేశాలు నిర్వహించకూడదని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం చాలా బాధాక దురదృష్టమని పేర్కొన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర చేసేవాడా? ఇలా అప్పటి ప్రభుత్వం వేదించినట్లయితే అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ప్రచార రథం వారాహి పేరు విన్నా, చూసిన వైసీపీ నేతలకు ప్యాంట్లు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు 2024 లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చరమ గీతం పాడతారని పేర్కొన్నారు. తక్షణమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ ఒకటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.