తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం పేరుతో భక్తులను నిలువు దోపిడీ చేస్తున్నారు

  • జనసేన నాయకుల మీద పెట్టే శ్రద్ధ – శ్రీవారి భక్తుల అవసరాల మీద పెట్టండి.

తిరుపతి, కరోనా తరువాత తిరుమలకు ప్రతిరోజు లక్ష మందికి తగ్గకుండా భక్తులు దర్శనార్ధం వస్తున్న రద్దీ సమయంలో, భక్తులకు కావలసిన కనీస వసతులను టీటీడీ పాలక మండలి అందించలేక పోతున్న తరుణంలో జనసేన పార్టీ తరపున గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోని టీటీడీ అధికారులు. భక్తులకు కనీస అవగాహన కల్పించకుండా వారు తెచ్చుకున్న బాటిల్స్ ను, చిన్న బిడ్డల పాలడబ్బాల సైతం అలిపిరి చెక్ పోస్ట్ వద్ద నిర్ధాక్షణ్యంగా పేర్కొంటున్నారు. చెక్ పాయింట్ వద్ద నుంచి కొండకు చేరుకునే 40 నిమిషాల సమయంలో ఆరోగ్యరీత్యా అత్యవసర సమయంలో మంచినీరు అవసరమైన భక్తుల పరిస్థితిని ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయాలు తగ్గవు, టీటీడీలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే మాపై నిఘా వ్యవస్థను పెడతారా, మాపై పెట్టిన శ్రద్ధ శ్రీవారి భక్తుల వసతుల మీద పెట్టండి, జనసేన నాయకులను, జనసైనికులను ఇబ్బందులకు గురి చెయ్యాలని చూస్తే టీటీడీ ఈవో ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చుంటామని సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జనసేన పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, రాజేష్ యాదవ్, సుమన్ బాబు, కొండా రాజమోహన్, రాజేష్ ఆచారి, రాజేష్ నాయక్ లతో కలిసి తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా కొండపై నీళ్ళు నిలువు దోపిడీ చేస్తున్నారని ఒక బాటిల్ నీళ్లు అరవై లేక డెబ్బై రూపాయలు డిపాజిట్ల రూపంలో భక్తులకు అంట కడుతున్నారని భక్తులు తిరిగి వెళ్ళే సమయంలో ఆ గాజు బాటిల్స్ లను ఇచ్చే సమయము లేక బయట పడవేసి వెళ్తున్నారని గతంలో ఒక ఉన్మాది గాజు బాటిల్ తో భక్తులపై హల్చల్ చేశారని గుర్తు చేస్తూ, ఈ విధంగా బయట పడవేసి వెళ్ళిన గాజు బాటిల్స్ ను పిచ్చి వాళ్ళు, ఉన్మాదులు మారణాయుధాలుగా వాడే అవకాశం ఉందని తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని పనికొచ్చే వాటి మీద శ్రద్ధ పెట్టి టీటీడీ నే సొంతంగా వాటర్ బాటిల్ లను తయారు చేయాలని జనసేన నాయకులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.