అనకాపల్లి జనసేన ఆధ్వర్యంలో జనసేన జెండా ఆవిష్కరణ

అనకాపల్లి జనసేన పార్టీ ఆఫీసులో అనకాపల్లి జనసేన ఇంచార్జ్ పరుచూరి భాస్కర్ నేతృత్వంలో ఆదివారం ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన భవిష్యత్ కార్యాచరణపై చర్చించడం జరిగింది. అలాగే నెహ్రూ చౌక్ జంక్షన్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.