సత్తెనపల్లి జనసేన – తెలుగుదేశం ఆధ్వర్యంలో ధర్నా

సత్తెనపల్లి నియోజకవర్గము, సత్తెనపల్లి పట్టణ నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వారి కార్యాలయం వద్ద, జనసేన-తెలుగుదేశం ఉమ్మడి కార్యాచరణలో భాగంగా రైతాంగ సాగునీటి సమస్యలను ప్రభుత్వ దృష్ఠికి తీసుకొచ్చేందుకు నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు బొర్రా వెంకట అప్పారావు మాట్లాడుతూ.. ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రైతులకు ఏదేదో ఇస్తాను మాయమాటలు చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పింది. కేసిఆర్ ఎడమకాలువతో ఆ ప్రాంత ప్రజలకు న్యాయం చేస్తుంటే, ఇక్కడ అంబటి రాంబాబు జలవనరుల శాఖ మంత్రిగా ఉండి అందులో వాటా ఏంది, వ్యవహారం ఏందీ అని కనీసం మాట్లాడలేని అసమర్ధ పరిస్థితిలో అంబటి రాంబాబు ఉన్నాడు. ప్రజలంతా పత్తి, మిర్చి, మాగాణి వేసి నీటితో ఇబ్బందులు పడుతుంటే, అంబటి రాంబాబు కాన్వాయ్ వేసుకొని తిరగడంతో సరిపోతుంది. ప్రజల కష్టాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా దుర్మార్గంగా పాలన కొనసాగిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాలి హైదరాబాదులో ఉన్న వాటాలను తెలంగాణ ఇచ్చి వచ్చాడు. కేసులున్నాయని భయంతో వాళ్లు నీళ్లు తీసుకెళ్తున్న ఏమీ చేయలేని అసమర్థుడుగా చూస్తూ ఉన్నాడు. మా వాటా మాకు కావాలని నోరెత్తి మాట్లాడాలేని అసమర్ధ పరిస్థితిలో ఉన్నాడు. ఇటువంటి అస్మత్ ముఖ్యమంత్రి రాష్ట్రంలో కొనసాగటానికి వీలులేదని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో సత్తెనపల్లి తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ కన్నా లక్ష్మీనారాయణ, ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, ఏడో వార్డు కౌన్సిలర్ రంగశెట్టి సుమన్, సత్తెనపల్లి రూరల్ మండల అధ్యక్షులు నాదెండ్ల నాగేశ్వరరావు, ముప్పాళ్ళ మండల అధ్యక్షులు సిరిగిరి పవన్ కుమార్, నకరికల్లు మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, రాజుపాలెం మండల అధ్యక్షులు తోట నరసయ్య, జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు భతుల కేశవ, మండల ఎస్సీ నాయకులు చిలకాపూర్ణ, నియోజకవర్గ జనసైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నేతలు, వామపక్షాల నేతలు పాల్గొన్నారు.