మూడు నెలల్లో పూర్తి చేసి ఇస్తామన్న పక్కా ఇల్లు ఏవి..?: కుప్పాల జ్యోతి

ఉమ్మడి కడప జిల్లా, జనసేన పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ కుప్పాల జ్యోతి గురువారం మట్లాడుతూ అన్నమయ్య డ్యాం వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని, ఎన్నాళ్ళు? ఎన్నేళ్ళు ఈ కన్నీళ్లు, వరసగా నాలుగు పంటలు కోల్పోయిన రైతుల దుస్థితి ఏమిటి? మూడు నెలల్లో పూర్తి చేసి ఇస్తామన్న పక్కా ఇల్లు ఏవి..? గుడారాలకు విముక్తి ఎప్పుడు? అని ప్రశ్నించారు. సొంత జిల్లా అయినటువంటి ముఖ్యమంత్రి జిల్లాలోని పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఇక రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఆధ్వర్యంలో 30 వ తేదీ అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టర్ కార్యాలయం ఎదురుగా ఎన్నాళ్ళు ఎన్నేళ్లు ఈ కన్నీళ్లు అనే అన్నమయ్య జిల్లా డ్యాం బాధ్యతలకు న్యాయం చేయాలని మరొక్కసారి గళం ఎత్తి బాధ్యతలతో కలిసి ఒక రోజు రిలే నిరాహార దీక్ష చేసి, కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించే కార్యక్రమం చేపట్టాలని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, తెలియజేశారని, కావున ప్రతి ఒక్కరు, ఉమ్మడి కడప జిల్లా నలుమూలల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నానని జనసేన పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్ కుప్పాల జ్యోతి తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి సొంత జిల్లా అయినటువంటి కడప జిల్లాలోనే ప్రజల యొక్క సమస్యలు పరిష్కరించక వైయస్సార్సీపికి ప్రజలు 2024లో కచ్చితంగా బుద్ధి చెప్పి గద్దె దింపుతారని అన్నారు.