పెళ్లి పీటలెక్కిన బాలీవుడ్ బ్యూటీ దియా మీర్జా..

ప్రముఖ బాలీవుడ్ నటి దియా మీర్జా కూడా రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ బిజినెస్ మ్యాన్ వైభవ్ రేఖిని ఈ సోమవారం రాత్రి పెళ్లి చేసుకుంది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ సెరమనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరి పెళ్లి ముంబాయి బాంద్రాలోని బెల్ ఏయిర్ అపార్ట్‌మెంట్‌లో జరిగింది.

ఈ వివాహా వేడుకకు 50 మంది గెస్టులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకకు బాలీవుడ్ నుంచి మలైకా అరోరా, అతిథి రావు హైదరీ, జాకీ భగ్నానీ వంటి ప్రముఖులు హాజరయ్యారు. దియా మీర్జా, వైభవ్‌లకు ఇది రెండో పెళ్లి. దియా మీర్జా 2014లో ఢిల్లీ బిజినెస్ మెన్ సాహిల్‌ సంఘాను ప్రేమించి పెళ్లి చేసుకుంది దియా మీర్జా. వీరి పెళ్లి హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఈ వేడుకలో దియా మీర్జా సాంప్రదాయ చీరకట్టులో మెరిసిపోయింది.

దానికి కొన్నేళ్ల ముందు నుంచే వాళ్లిద్దరూ సహజీవనం చేసారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల అంగీకారంతో 2014 అక్టోబర్‌లో ఢిల్లీలోని చత్తార్‌పూర్‌లో పెళ్లి చేసుకున్నారు 11 ఏళ్ల తర్వాత తన మొదటి భర్తతో విడాకులు తీసుకుంది దియా మీర్జా. ఈమె హిందీలో దాదాపు 30 సినిమాలకు పైగా నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈమె తన పెళ్లి సందర్భంగా వచ్చిన అతిథిలకు స్వయంగా స్వీట్లు అందించడం విశేషం.