డయేరియా మృతులు ప్రభుత్వ హత్యలే

  • పాలకుల నిర్లక్ష్యంపై మండిపడ్డ నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు, నగరంలో కలుషిత నీరు తాగి డయేరియా బారినపడి మరణించిన నలుగురువి ప్రభుత్వ హత్యలే అని నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ అన్నారు. ఆదివారం డయేరియాతో మరణించిన గాజుల సూర్యనారాయణ మృతదేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేదని తాగునీరు కలుషితమవుతుందని ఎంతగా మొత్తుకుంటున్నా పాలకుల్లో కానీ అధికారుల్లో కానీ ఏమాత్రం చలనం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు గుక్కెడు రక్షిత మంచినీరు దుస్థితిలో నగరపాలక సంస్థ పనితీరు ఉండటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆందోళన కరంగా ఉన్నాయన్నారు. డయేరియా ఆనవాళ్లు ఎక్కడా లేవంటూ కమీషనర్ , మేయర్ వ్యాఖ్యానించటం బాధ్యతారాహిత్యం అంటూ నేరేళ్ళ సురేష్ మండిపడ్డారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ పదేళ్లు శాసనసభ్యుడిగా అధికారం ఇస్తే ముస్తఫా తన అసమర్థతతో నియోజకవర్గాన్ని అట్టడుగుస్తాయికి తీసుకెళ్లాడని ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేనైన తన మాట వినడం లేదంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముస్తఫా డ్రామాలు మొదలుపెట్టాడని మండిపడ్డారు. కమల్ హాసన్ నటనలు ఆపి ఇప్పుడైనా ప్రజలకి సేవాలందించాలని ముస్తఫాకి హితవు పలికారు. డయేరియాతో మృతిచెందిన కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆళ్ళ హరి కోరారు. డివిజన్ అధ్యక్షుడు గాజుల రమేష్, రెల్లి యువనేత సోమి ఉదయ్ కుమార్, బందెల నవీన్, పులిగడ్డ నాగేశ్వరరావు, కలగంటి త్రిపుర, ఆకుల ప్రసాద్, నండూరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.