జనసేనానిని విమర్శించడానికే వైయస్సార్ ప్లీనరీ జరిపారా: బండి వెంకటేశ్వర్లు

ఉమ్మడి చిత్తూరు జిల్లా, తంబాలపల్లి నియోజకవర్గం, జనసేన పార్టీ జాయింట్ సెక్రెటరీ బండి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వైయస్సార్ పార్టీ ప్లీనరీ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి సంక్షేమ పథకాలు గాని.. ప్రజలకు వారు ఎటువంటి సేవ చేస్తారు అనే దానిపై గాని చర్చ లేకుండా.. ప్రతిపక్షాలను పదేపదే ప్రస్తావిస్తూ.. వారి ప్రసంగం సాగడం చాలా హాస్యాస్పదంగా ఉంది. రోజా గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారిని మీరు వీల్ హీరో మాత్రమే రియల్ హీరో కాదు అని చెప్పడం చాలా సిగ్గుచేటు. రోజా గారిని అడుగుతున్నాము అమ్మ రోజా గారు ఏ రోజైనా మీ సొంత డబ్బు ఏ బాధితులు కైనా మీరు సహాయం చేశారా. మా పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును ఇప్పుడే కాదు తన సినీ జీవితం మొదలైనప్పటి నుండి ఎన్నో సహాయ కార్యక్రమాలు చేశారు. ప్రత్యేకించి వాటిని మీకు మేము చెప్పనవసరం లేదు ఇప్పుడు కూడా మీ ప్రభుత్వం కవులు రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా అలాంటి రైతులకు మా అధ్యక్షులు ఈ రోజు అండగా నిలబడి.. వారి కుటుంబాలకు లక్ష రూపాయలు చొప్పున సహాయం చేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. మీ పార్టీ వాళ్లు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడ ప్రెస్ మీట్ లు పెట్టినా.. కేవలం మా అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే ప్రత్యేకించి విమర్శలు చేస్తూ ఉన్నారు. ఒక్కరే రండి ఎన్నికలకు అని నిర్ణయించడానికి నీవెవరు.. ఒక్కరమే.. వస్తామొ పొత్తులతో వస్తామొ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి మీరు. అంతేగాని నిర్ణయించడానికి నీవెవరు.. ఈరోజు నీవు చేసిన వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నిన్ను చీదరించుకుంటున్నారు.. ఇప్పటికైనా మీరు తీరు మార్చుకుని ప్రజలలో మీపై విశ్వాసాన్ని పెంచుకోండి.. అంతేగాని ఎప్పుడు ప్రతిపక్షాలపై పడి ఏడవకండి. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ షాకీర్ భాష మరియు నియోజకవర్గ జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.