బుడతనాపల్లి రోడ్డు దుస్థితిపై జనసేన, టిడిపిల డిజిటల్ క్యాంపెయిన్

గజపతినగరం నియోజకవర్గం: జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ మరియు టిడిపి ఇంఛార్జి (మాజీ ఎమ్మెల్యే) డా.కే.ఏ నాయడు ఆధ్వర్యంలో గజపతినగరం నియోజకవర్గం, గంట్యాడ మండలం, కొట్టారుబిల్లి జంక్షన్, బుడతనాపల్లి రోడ్డు దుస్థితిపై ఇరుపార్టీల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగున్నర సంవత్సరాలలో రాష్ట్రంలో ఉన్న రహదారులు మరమ్మత్తులకు నోచుకోలేదు. రహదారులు అన్నీ గుంతలమై ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. కొన్ని గ్రామాల్లో వేసిన రోడ్లు కూడా నాణ్యతాలోపం కనిపిస్తుంది. సంవత్సర కాలం గడవక ముందే పోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు హడావుడిగా రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించామని చెప్పడం, కొబ్బరి కాయలు కొట్టి శంకుస్థాపన చేసినట్టు ఓట్ల కోసం ప్రజల్ని మభ్యపెట్టడం తప్ప మరోటి కాదు అని జనసేన నియోజకవర్గ సమన్వయకర్త మర్రాపు సురేష్ దుయ్యబట్టారు. టిడిపి ఇంఛార్జి డా.కే ఏ నాయడు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యంగా ఉన్న వైసిపిని వచ్చే ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని, ప్రజలు చైతన్యవంతంగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ప్యాక్ మెంబర్ పడాల అరుణ, జిల్లా సీనియర్ నాయకులు డా.రవికుమార్ మిడతాన, వీరమహిల దుర్గ, నియోజకవర్గ సీనియర్ నాయకులు కలిగి అప్పారావు ( పండు) శ్రీను కడమల, హేమ సుందర్, మజ్జీ కోటి, బురీల రాము, పైల మహేష్, బాలు యాదవ్, చంటి, ఎర్ని నాయడు, బద్రి, జానీ, గోవింద్,ఆదినారాయణ, నాయడు, ప్రశాంత్, నాగరాజు, గౌరీ నాయడు, జనసేన-టిడిపి మండల అధ్యక్షులు భాస్కర్ నాయడు, అప్పలరాజు, బండారు బాలాజీ, జగన్, నాయకులు, నియోజకవర్గం శ్రేణులు పాల్గొన్నారు.