గ్రామసమస్యలపై జనసేన కరపత్రాల ఆవిష్కరణ

పాడేరు: జనసేన పార్టీ నాయకులు వివిధ గ్రామ సమస్యలపై స్పందనగా గ్రామ పర్యటన చేస్తూ జనసేన పార్టీ ద్వారా గ్రామసమస్యలపై కరపత్ర ఆవిష్కరణ చేశారు. ముందుగా వంటలమామిడి, ఒంజబర్తి, గుంజిగెడ్డ, మిట్టలపాడు గ్రామాలను సందర్శించి స్థానిక గ్రామాల సమస్యలు అడిగి తెలుసుకుని, వారిని చైతన్యపరిచేవిధంగా రాజకీయాల ఆవశ్యకత కోసం నియోజకవర్గ లీగల్ సెల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్ వివరించారు. ఈ సందర్భంగా వంటలమామిడి జనసేన నాయకులు సతీష్ స్థానిక గ్రామ సమస్యలపై తమ గళాన్ని ప్రభుత్వానికి నివేదిస్తూనేవున్నామని, ఆశించిన స్పందన వస్తున్నప్పటికీ ఫలితాలలో జాప్యం జరుగుతోందని అన్నారు. గ్రామ పర్యటనలో భాగంగా మిట్టలపాడు నుంచి జి.మాడుగుల మండలం చేరుకోవడానికి గల రోడ్డు సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు తెలిపారు. మేము జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులమయ్యామని రానున్న ఎన్నికలలో మొట్టమొదటిసారిగా ఒక నీతి నిజాయితీ గల పార్టీని ఎన్నుకుంటామని అన్నారు. ఈ పర్యటనలో లీగల్ సెల్ ఇన్చార్జ్ కిల్లో రాజన్, సతీష్, నాగేష్, అశోక్, రవి తదితర జనసైనికులు పాల్గొని, జనసేన పార్టీ కరపత్రం అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్య అదేశాల మేరకు ఆవిష్కరణ చేశారు.