100 కోట్ల టీకా డోసుల పంపిణీ.. భారత్‌కు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ శుభాకాంక్షలు

కరోనా కట్టడిలో భాగంగా 100 కోట్ల కొవిడ్‌-19 టీకా డోసుల పంపిణీ మైలురాయిని అధిగమించిన భారత్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధనమ్ బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. కరోనా వైరస్ నుంచి ప్రజలు, అణగారిన వర్గాలను కాపాడటంలో భారత ఆరోగ్య కార్యకర్తలు, శాస్త్రవేత్తలు, ప్రజలు సాగించిన కృషి ప్రశంసనీయమని అన్నారు… ఇక వంద కోట్ల టీకా డోసుల పంపిణీతో భారత్ చరిత్ర సృష్టించిందని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.. భారత సైంటిస్టులు, సమర్ధ నిర్వహణతో పాటు 130 కోట్ల మంది భారతీయుల స్పూర్తికి ఇది సంకేతమని పేర్కొన్నారు.. ఈ అద్భుత ఘనత సాధించేందుకు కృషి చేసిన డాక్టర్లు, నర్సులు, అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.