జనసేన వనరక్షణలో 1300 కొబ్బరి మొక్కల పంపిణీ

  • జనం కోసం జనసేన 578వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 578వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం ఆదివారం గండేపల్లి మండలం, యల్లమిల్లి మరియు జగ్గంపేట మండలం, గుర్రప్పాలెం గ్రామాలలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1300 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 8800 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 579వ రోజు కార్యక్రమం సోమవారం గోకవరం మండలం, రంపయర్రంపాలెం గ్రామంలో జనసైనికుల ఆధ్వర్యంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి బుదిరెడ్డి శ్రీనివాస్, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, జగ్గంపేట మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు లంకపల్లి భవాని, గోకవరం మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు చల్లా రాజ్యలక్ష్మి, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజు, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, జగ్గంపేట మండల అధికార ప్రతినిధి పాలిశెట్టి సతీష్, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు వరుపుల శ్రీను, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, జగ్గంపేట మండల ప్రధాన కార్యదర్శి గండికోట వీరపాండు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు గారికి, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి బొట్ల రాజుబాబు గారికి, జగ్గంపేట మండల సంయుక్త కార్యదర్శి మానెల్తి దుర్గాప్రసాద్, యల్లమిల్లి నుండి సత్తి శ్రీను, సత్తి మహేష్, బొడ్డు శివ, నగదర చక్రధర్, ఉమ్మడి తరుణ్, గుర్రప్పాలెం నుండి బండారి సుబ్రహ్మణ్యం, పిరమళ్ళ రాజు, అడ్డాల సూరిబాబు, పలక వంశీ, పన్నీరు వినయ్, పడాల చిన్నారి, గొంపి లోవరాజు, మానేల్తి గణేష్, కొండపల్లి వీరబాబు, అక్కిరెడ్డి రాజా, జగ్గంపేట నుండి లంకపల్లి అజయ్(బన్ను), మల్లేపల్లి నుండి పితాని వీరబాబు, నూకలబంటు రామకృష్ణ, మర్రిపాక నుండి పాటంశెట్టి శ్రీనివాస్, ఉరమళ్ళ శ్రీను, బూరుగుపూడి నుండి పాటంశెట్టి రామకృష్ణ, సగరపేట నుండి గండికోట బాల బాలాజీ, కృష్ణాపురం నుండి అమరపల్లి శ్రీనివాస్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, డేగల రాంబాబులకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.