మైనింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలి: చిట్టం మురళి

అల్లూరి సీతారామరాజు జిల్లా, అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలం, వాలసి పంచాయతీ రాళ్ళగడ మరియు నిమ్మలపాడు ప్రాంతం: 5వ షెడ్యూల్ చట్టాలను ఉల్లగించి మైనింగ్ చేస్తున్న మైనింగ్ మాఫియాపై వెంటనే చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ మండల అధ్యక్షులు చిట్టం మురళి డిమాండ్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన జాతికి రక్షణ కౌసం మైన పిసా చట్టాన్ని మరియు 5వ షెడ్యూల్ ఉన్న ప్రకారంగా కాకుండా మైనింగ్ మాఫియా నిమ్మలపాడు కాల్ సెట్ మైనింగ్ ఇష్టం వచ్చినట్టు తీయడం చట్ట విరోధం దీనికి కారకులైన వారు వారిపై ఎంతటి వారైనా జనసేన పార్టీ పోరాటానికి వెనకంజ వెయ్యదు?. అలాగే పంచాయతీకి 20శాతం రాయల్టీ కట్టాలి, పిసా చట్టానికి వ్యతిరేకంగా ఉన్నా రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి. ఈ ప్రభుత్వం గిరిజనులు మీద తమ వైఖరి స్పష్టముగా చెప్పాలి. వైసీపీ ప్రభుత్వ్వ్నికి గిరిజనుల చట్టాలపై అవగాహన ఉందో లేదో తెలియడం లేదు. నిజంగా గిరిజనుల మీద ప్రేమ ఉంటే 5వ షెడ్యూల్ ప్రాంతమైన కాల్ సెట్ మైనింగ్ లో జరుగుతున్న అక్రమాన్ని విచారించి వారిపై చర్యలు తీసుకోవాలి, 1997లో సుప్రీంకోర్టులో వందకు పైగా పుట్టల సూరీర్గా తీర్పును వేలువరించింది, ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పుని ప్రకటించింది. లీజు ద్వారాగాని చట్టానికి తెలిసిన మారే ఏ విధముగా రూపంలో గాని రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ ప్రాంతంలో భూమి ఏ వ్యక్తికి అయినా అది సమాజము లేక న్యాయమైన వ్యక్తి అయినా బదిలీ చేయడం నిషేధం అని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. గిరిజనులకు సాంఘిక ఆర్థిక విద్యా ప్రయోజనాలను కాపాడాల్సిన బాధ్యత కార్యనిర్వహణ వ్యర్థ మీదే ఉంది ఉన్నది. గనుక రాష్ట్ర షెడ్యూల్ ప్రాంతంలో భూములను సహజ వనరులను ఉపయోగించుకునేవారు గిరిజనుల సాంఘిక ఆర్థిక విద్య అభివృద్ధికి బాధ్యత వహించాలి. ప్రాజెక్ట్ నిర్వహణ భాగంగా లైసెన్స్ ధరలు లేక లీజ్ దారులు మరియు ఏపీఎండీసీ మైనింగ్ సంస్థ కొంత బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు తెలియజేసింది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అతి దారుణంగా గిరిజనుల్ని మోసం చేస్తూ.. గిరిజన బ్రతుకులను చిన్నా భిన్నము చేస్తూ మైనింగ్ మాఫియాను ప్రోత్సహించడం, వారిని కాపాడడం చేస్తున్నది. ఈ ప్రభుత్వం గిరిజన ద్రోహి. గిరిజన ప్రజలపై ఈ ప్రభుత్వం యొక్క వైఖరి స్పష్టంగా తెలుస్తుంది. ఇలా 5 షెడ్యూల్ లో చట్టాలను మరియు సుప్రీంకోర్టు తీర్పును లెక్కచేయకుండా గిరిజనుల బ్రతుకులు నాశనం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైసిపి ప్రభుత్వం ఐదో షెడ్యూల్ చట్టాలను సుప్రీంకోర్టు చట్టాలను లెక్క చేయని ప్రభుత్వం గిరిజన ద్రోహి ప్రభుత్వం అని మురళి మండిపడ్డారు.