జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజానగరం: జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదల పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా కార్యకర్తలకు కష్టకాలంలో పార్టీ అండగా వుండే విధంగా అమలులోనికి తెచ్చిన క్రియాశీలక సభ్యత్వంలో భాగంగా 2023-2024 క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసుకున్న వారికీ సభ్యత్వ కిట్లు రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ మేడ గురుదత్ ప్రసాద్ ఆదేశాల మేరకు బుధవారం రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొరసమక్షంలో రాజానగరం మండలం, జి. ఎర్రంపాలెం గ్రామ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ రాజకుమార్ ద్వారా సభ్యత్వ నమోదు చేసిన అందరికీ అందజేశారు.