పి.గన్నవరంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పి.గన్నవరం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇటు కార్యకర్తల భద్రత అటు పార్టీ అభివృద్ధి కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వం కిట్లను పంపిణీ కార్యక్రమం మామిడికుదురు మండలం పెదపట్నంలంక గ్రామంలో జరిగింది. మండల పార్టీ అధ్యక్షులు జాలె౦ శ్రీనివాసరాజా(జె.ఎస్.ఆర్) సభాధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా గత ఎన్నికల పార్లమెంటరీ అభ్యర్థి డిఎంఆర్ శేఖర్ పాల్గొని సభ్యత్వ కిట్లను నమోదు చేసుకున్న వారికి అందించాడం జరిగింది. అనంతరం ఎస్సీ సామాజిక వర్గం నుండి జనసేన పార్టీ పట్ల ఆకర్షితులైన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా డిఎంఆర్ శేఖర్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్రంలో వైసిపి పరిపాలన అరాచకంగా సాగుతుంది సమాజంలో కులాల మధ్య చిచ్చుపెట్టి స్వార్థపూరిత పరిపాలన చేస్తోందని రాబోయే ఎన్నికల్లో వైసిపికి కచ్చితంగా బుద్ది చెప్పి ప్రజలందరూ జనసేనకు మద్దతుగా నిలవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు గిడుగు బంగారం స్థానిక ఎంపిటిసి కొమ్మలు జంగమయ్య, సర్పంచ్ అడబల తాతకాపు, మండల ఉపాధ్యక్షులు మామిడిశెట్టి శివరామప్రసాదుగారు, దొడ్డా జై రామ్, పోతు కాశీ, కంకిపాటి నరసింహారావు, మద్దింశెట్టి బుజ్జి, శ్రీమతి దుర్గాభవాని, గుబ్బల పండు, చెరుకూరి సత్తిబాబు, కాట్రేనిపాడు నాగేంద్ర తదితర స్థానికులు పాల్గొన్నారు.