నిమ్మనపల్లె మండలంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి చిత్తూర్ జిల్లా, మదనపల్లె నియోజకవర్గం, నిమ్మనపల్లె మండలంలో ఆదివారం జనసేన నిమ్మనపల్లె మండల అధ్యక్షుడు సోలంకి ప్రదీప్ సింగ్ అధ్యక్షతన.. వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ బీమా పత్రాలు అందచేయడము జరిగింది. ఈ కార్యక్రమంలో వాలంటీర్స్ తోట కళ్యాణ్, ప్రదీప్ సింగ్, బాబీరెడ్డి, మదనపల్లె ఐటీ కోఆర్డినేటర్ రాజేష్ కుమార్ లకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాయలసీమ కో కన్వినిర్ గంగారపు రామదాసుచౌదరి దుశ్శాలువతో మరియు పూల హారముతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, రూరల్ అధ్యక్షుడు రోనురి బాబు, ఐటీ ఎంప్లాయ్ లక్ష్మి నారాయణ, రెద్దమ్మ, భారత్, ఆఫ్రోజ్ వెంకటరమణ, పవన్ రెడ్డి, బి కళ్యాణ్ సింగ్, గౌరీ భాయ్, డి రవిసింగ్, జయమ్మ, ప్రదీప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.