పుంగనూరులో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పుంగనూరు నియోజకవర్గం: పుంగనూరు టౌన్ లో స్థానిక కొత్తఇండ్లు లో ఉన్న వృద్ద ఆశ్రమం నందు ఆదివారం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వ భీమా పత్రం, జనసేనాని రాజకీయ ప్రస్థానంతో కూడిన మనోగతం తెలిపే పుస్తకం జనసైనికులకు అందించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసైనికులూ ఏదైనా ఆపదలు, ప్రాణాపాయం వస్తే తాను అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టినట్లు తెలిపారు. జనసేన పార్టీ పట్ల బాధ్యతగా వ్యవహరిస్తు మరెన్నో సేవా కార్యక్రమాలు పార్టీకి అందిస్తామని పుంగనూరు టౌన్ ప్రసిడెంట్ నరేష్ రాయల్, చిత్తూరు జిల్లా పోగ్రామ్స్ సెక్రటరీ చైతన్య రాయల్, పుంగనూరు ఐటీ ఇంచార్జీ దేసాది వికాస్ లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు మర్లపల్లి రమేష్, వెంకీ, మనోజ్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.