జనసేన పార్టీ సిద్ధాంతాలు మ్యానిఫెస్టోతో కూడిన క్యాలెండర్ల పంపిణీ

తాడిపత్రి: జనసేన పార్టీ మండల కన్వీనర్ కోడి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో క్యాలెండర్లను ఆపార్టీ ఉపాధ్యక్షలు జాకీర్ హుస్సేన్ మరియుకార్యకర్తలందరూ కలిసి పంచడం జరిగింది. యాడికి మెయిన్ బజార్లో ఉన్న కిరాణ షాపులు, టీ స్టాల్స్, ఇతర షాపింగ్ కాంప్లెక్స్, ఆటో స్టాండ్స్, పండ్ల కొట్లు, మెడికల్ షాప్స్ మరియు చిరు వ్యాపారస్తులకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా సునీల్ కుమర్ మాట్లాడుతూ క్యాలెండర్ల నందు పవన్ కల్యాణ్ ఆశయాలను సిద్ధాంతాలను మరియు మ్యానిఫెస్టోను ప్రచురించినట్లు తెలిపారు. వీటితో పాటు జనసేన పార్టీ ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు అందిస్తున్న లక్ష రుపాయల సాయాన్ని పవన్ కల్యాణ్ చేసిన ప్రజా మరియు రాజకీయ పోరాటాలను ప్రజా సమస్యలపై పార్టీ సాధించిన విజయాలను కూడా వేసినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పార్టీ భవిష్యత్తులో చేపట్టబోయే కార్యక్రమాల వివరాలను కూడా పొందుపరిచామన్నారు క్యాలెండర్లను పంచుతూ వీటన్నింటినీ ప్రజలకు వివరిస్తూ జనసేన పార్టీని గుర్తించాలని వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వాలని పవన్ కళ్యాన్ ని ముఖ్యమంత్రి ని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, శివ, మల్లి, విజయ్, రాజేష్, మహేష్, నరేష్, మధుఆచారి, జాని ఇతర జనసైనికులు పాల్గొన్నారు.