జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

  • జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసిన షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు: అనంత సాగరం మండలం, జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో అనంత సాగరం మండలం పాత దేవరాయ పల్లి పంచాయతీలో బుధవారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం. తీసుకున్నవారికి కిట్లు పంపిణీ చేశారు. మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ మాట్లాడుతూ.. ఆత్మకూరు నియోజకవర్గంలో అత్యదికంగా 200 పైచిలుకు సభ్యత్వాలు చేయడం జరిగింది. అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దేశంలో ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా కార్యకర్తల కుటుంబాలకు భరోసా ఇస్తూ 500 రూపాయలు కట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు ప్రమాదవశాత్తు మరణించినప్పుడు వారి కుటుంబానికి ఐదు లక్షల బీమా పథకం పార్టీ తరపున అమలవుతోంది చిన్న చిన్న ప్రమాదాలు జరిగినప్పుడు కూడా 10000 నుంచి 50 వేల రూపాయల మెడికల్ ఇన్సూరెన్స్ జనసేన పార్టీ తరఫునుంచి అందజేస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల కార్యదర్శి మిట్టమల్ల పెంచలయ్య, హరికృష్ణ, షేక్ ఇమ్రాన్, గోపాల్, వంశీ, అజయ్, జన సైనికులు పాల్గొనడం జరిగింది.