కంబరవలసలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం, కంబరవలస గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన క్రియాశీలక సభ్యత్వం కిట్లు పంపిణీ కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమనికి నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, క్రియాశీలక సభ్యత్వం వాలంటీర్ మత్స పుండరీకం ముఖ్య అతిథిగా విచ్చేసి.. జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు 5 లక్షల రూపాయల జనసేన బీమా పత్రాలు, క్రియాశీలక సభ్యత్వ కిట్స్ పంపిణిచేశారు. అనంతరం క్రియాశీలక సభ్యులందరి చేత ప్రతిజ్ఞ చేయిoచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీకి.. ప్రజలకు క్రియాశీల సభ్యులు వారధిగా నిలవాలని.. జనసేన పార్టీ సిద్ధాంతాలను ఇంటి ఇంటికి చేరవేసే విధంగా అందరూ కృషి చేయాలని, ప్రతి గ్రామoలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులంతా కలిసికట్టుగా ఒకే లక్ష్యంతో పని చేయాలని జనసేన పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. జనసేన పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. కంబరవలస గ్రామ జనసైనికులు దండేల చందు మాట్లాడుతూ.. శ్రీ పవన్ కళ్యాణ్ గారిని
ప్రాణప్రదంగా ప్రేమించే కార్యకర్తల్ని జనసేన అధ్యక్షులు కూడా అదేవిధంగా ప్రేమిస్తారు అని అన్నాడు. గొడబ మహేష్ మాట్లాడుతూ.. క్రియాశీలక సభ్యత్వం ద్వారా ప్రమాద జరిగినపుడు మెడికల్ బిల్స్ కు 50 వేల రూపాయలు.. అలాగే వ్యక్తిని కోల్పోతే వారి కుటుంబాాకు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినపుడు వారికి అది ఎంతో ఆసరాగా నిలబడుతుందన్నారు. దండేల సతీష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల 50 వేల మంది క్రియాశీలక సభ్యులతో పటిష్టమైన ప్రణాలికలతో.. రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు తథ్యం అని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో కంబరవలస గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు కలమట పోలిష్, దండేల వంశీ, బోను సింహాచలం, సాకేటి కృష్ణమూర్తి, ఆనందరావు, దండేల మహేష్, కొమెజు సుధ , చంద్రశేఖర్, తదితర జనసైనికులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.