జొన్నలగడ్డ గ్రామంలో 3వ రోజు జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

గుంటూరు, ప్రత్తిపాడు నియోజకవర్గంలో జొన్నలగడ్డ గ్రామంలో 3వ రోజు క్రీయాశీలక సభ్యత్వ కిట్లును పంపిణీ చేయడం జరిగింది. ఈ క్రియాశీలక కిట్ల బ్యాగ్ లో పవన్ కళ్యాణ్ భావజాలం, పార్టీ సిద్దంతాలు, పార్టీ భవిష్యత్ ప్రణాళికను పొందుపరచడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రీయాశీలక సభ్యత్వ వాలెంటీర్లను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అతిధిగా విచ్చేసిన గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడపా మాణిక్యాలరావు, నారదాసు రామ చంద్ర ప్రసాద్, త్రినాద్, మండల అధ్యక్షులు గంధం సురేష్, లీగల్ సెల్ కార్యదర్శి యుగంధర్, హుసేన్, ఇమ్మడ కోటి, నామ శ్రీనివాసరావు, గ్రామ పెద్దలు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.