పామిడిలో ఘనంగా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

గుంతకల్లు నియోజకవర్గం, పామిడి పట్టణంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం మరియు క్రియాశీలక సభ్యత్వం చేయించిన వాలంటీర్లకు సన్మాన కార్యక్రమం, అనంతపురం జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి పర్యవేక్షణలో, పామిడి మండల అధ్యక్షుడు ధనుంజయ్ ఆధ్వర్యంలో, జిల్లా కార్యదర్శి వాసగిరి మణికంఠ, లీగల్ సెల్ అధ్యక్షులు మురళి కృష్ణ, జిల్లా కార్యదర్శి చంద్ర మరియు సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరైన ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జగదీష్ కార్యదర్శి సూర్య ప్రకాష్ సంయుక్త కార్యదర్శి ఖాజావలి నిస్వార్థ జనసైనికుడు మోహన్ మురళికి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేయించినందుకు గాను వారిని ఘనంగా సత్కరించడం జరిగినది. అలాగే ఈ కార్యక్రమంలో పామిడి మండలం ఉపాధ్యక్షుడు శరత్ బాబు ప్రధాన కార్యదర్శులు వేణు గోపాల్, షేక్షావలి, కార్యదర్శులు పేన్న ఓబులేసు, తాడిపత్రి సిద్ధూ, రాము, రోషన్ జమీర్, దేవేంద్ర, ఆదిశేషు, సంయుక్త కార్యదర్శులు లాలూ స్వామి, నాగేంద్ర, సురేష్, విశ్వనాద్, విజయ్ కుమార్, అలాగే గుంతకల్ నియోజకవర్గం నాయకులు బండి శేఖర్ కి, పవర్ శేఖర్, వీరేష్ మరియు సోహెల్ కి మరియు పాల్గొన్న మిగతా గుంతకల్లు నాయకులకి ప్రత్యేక కృతజ్ఞతలు మరియు జనసేన పార్టీ కార్యకర్తలకు, జనసైనికులకు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది.