గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో
శుక్రవారం పాలకొండ మండలం అంపిలి గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొణిదల పవన్ కళ్యాణ్ గారు ఎంత పెద్ద మనసుతో జనసైనికులను కాపాడుకోవాలనే ఉద్దేశంతో జనసేన పార్టీ క్రియాశీలక బీమా పథకం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని గర్భాన సత్తిబాబు అన్నారు. అలాగే క్రియాశీలక సభ్యులు ఉద్దేశించి మాట్లాడిన ఆయన పవన్ కళ్యాణ్ గారికి ప్రజలకు మధ్య వారధిగా క్రియాశీలక సభ్యులు పనిచేయాలని అన్నారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా బాంబులు, కత్తులు, కటారులు, ఇవ్వలేదని ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చారని.. ఓటు అనే ఆయుధాన్ని ప్రజలు సరిగ్గా వినియోగించి.. దేశ భవిష్యత్తును మార్చే శక్తి ప్రజలకి ఉందని.. అవినీతి లేని సమాజాన్ని ఏర్పాటు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయితే అది సాధ్యమని గర్భాన సత్తిబాబు ప్రజలను ఉద్దేశించి మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో అంపిలి గ్రామ జనసేన నాయకులు జామి రాంబాబు, జనసైనికులు పాల్గొన్నారు.