చేజర్ల మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ

చేజర్ల: జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీలో భాగంగా ఆదివారం ఆత్మకూరు నియోజకవర్గం, చేజర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామం నందు చేజర్ల మండల ఇంచార్జ్ బండి అనిల్ రాయల్ మరియు ఉపాధ్యక్షులు ఎల్లంటి ప్రసాద్ ఆధ్వర్యంలో.. ఆత్మకూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ చేతుల మీదుగా క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి బీమా పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ.. ఏ పార్టీ కల్పించని విధంగా జనసేన పార్టీ కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా కల్పించిందని కొనియాడుతూ.. రాబోయేది ప్రజా ప్రభుత్వమేనని.. ఆ ప్రజా ప్రభుత్వం స్థాపించబోయేది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారే అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అరవింద్ రాయల్, సుబ్బమ్మ, వెంకటరత్నం, సునీల్ మరియు తదితరులు పాల్గొన్నారు.