జనసేన నేత తాడి మోహన్ కుమార్ జన్మదిన వేడుకలు

మామిడికుదురు మండలం, ఈదరాడ గ్రామంలో.. రాజోలు నియోజకవర్గ జనసేన నాయకుడు, జనసేన పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరి తాడి మోహన్ కుమార్ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు, జనసైనికులు, మరియు అభిమానుల మధ్య ఘనంగా జరిపారు. కార్యక్రమంలో భాగంగా జనసేన నాయకులు మోహన్ కుమార్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసి.. మోహన్ కుమార్ తో కేక్ కటింగ్ చేయించారు. ఈ వేడుకల్లో యెరుబండి చిన్ని, బొంతు సుధాకర్, నక్కా రామారావు, గుర్లింక గంగాధర్, యెరుబండి చిట్టిరాజా, చుట్టుగుళ్ళ బుజ్జి, పెదపూడి ప్రసాద్, పెదపూడి త్రిమూర్తులు, రుద్రా తాతా జీ, యెరుబండి మణి, హేమంత్, రామకృష్ణ, శ్యామ్, బంగారం, పలువురు జనసైనికులు పాల్గొన్నారు.