కలిదిండి మండలంలో ఎస్.ఆర్.పి అగ్రహారం, సానరుద్రావరం గ్రామాల్లో కిట్ల పంపిణీ

కైకలూరు నియోజకవర్గ కలిదిండి మండలం జనసేన క్రియాశీలక కిట్ల పంపిణీలో భాగంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచన మేరకు ఇంటింటికి జనసేనలో భాగంగా సానారుద్రవరం గ్రామం, ఎస్.ఆర్.పి అగ్రహారం గ్రామంలో వాలంటీర్లు చేసిన కిట్లు జనంలోకి జనసేన నినాదంతో ప్రతి ఇంటికి వెళ్లి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గ నాయకులు వలవల రవితేజ, కృష్ణాజిల్లా ప్రోగ్రాం కమిటీ మెంబర్ చెన్నంశెట్టి చక్రపాణి, కేసిరెడ్డి సురేష్, సానారుద్రవరం జనసైనికులు గంధం లక్ష్మణ్, కొండ, సాయి, పవన్, శేషు, అంజయ్య తదితర జనసైనికులు పాల్గొనడం జరిగింది.