అభిమానుల్లో మరింత ఉత్తేజాన్ని నింపిన ఇమ్మడి కాశీనాధ్

జనసేన అధినేత మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లనాయక్ మూవీకి మార్కాపురంలోని సాయిబాలాజీ థియేటర్ కి జనసేన పార్టీ మార్కాపురం నియోజవర్గ ఇన్చార్జ్ ఇమ్మడి కాశీనాధ్ విచ్చెసి అభిమానుల్లో మరింత ఉత్తేజాన్ని నింపారు. అలాగే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇమ్మడి కాశీనాధ్ థియేటర్ లో అడుగు పెట్టిన దగ్గర నుంచి అడుగడుగునా పూల వర్షం కురిపించి, బాణసంచా పేల్చి స్వాగతం పలికారు. అలాగే తమ అభిమాన దైవం పవన్ కళ్యాణ్ ను ఇమ్మడి కాశీనాధ్ లో చూసుకొని ఆనందించారు. ఇమ్మడి కాశీనాధ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా పవన్ కళ్యాణ్ క్రేజ్ మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు అని, మంచి సినిమాలను ప్రజలు ఎప్పుడు ఆదరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి తిరుమలశెట్టి వీరయ్య, సంయుక్త కార్యదర్శి ఎన్.వి.సురేష్, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, మార్కాపురం మండల అధ్యక్షులు తాటి రమేష్, జనసేన నాయకులు పిన్నెబొయిన శ్రీనివాసులు, శిరిగిరి శ్రీనివాసులు, జానకి రామ్ సింగ్ మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.