ఉమ్మడి ఆదిలాబాద్ జనసేన ఆధ్వర్యంలో సభ్యత్వ కిట్ల పంపిణీ

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, చెన్నూరు నియోజకవర్గం జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ తీసుకున్న నిర్ణయంలో భాగంగా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ల ఆదేశాల మేరకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు తన్నీరు మధుకర్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ మాయ రమేష్, యువజన విభాగం ఉపాధ్యక్షులు పిట్టల సుధాకర్ ల ఆధ్వర్యంలో ఆదివారం రోజున చెన్నూరు నియోజకవర్గము మందమర్రిలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రతి కార్యకర్తని కుటుంబ సభ్యులుగా భావించి వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న మా అధ్యక్షులు కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ అలాగే ప్రతి క్రియాశీలక సభ్యులు పార్టీకి బలోపేతం దిశగా పని చేసి గ్రామస్థాయిలో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు తెలియజేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జనసేన పార్టీ అధ్యక్షులు తన్నీరు మదుకర్, జిల్లా ఆర్గనైజింగ్ నాయకులు నల్లతిగల మహేష్, జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శి విష్ణు, నాయకులు లాబ్ సంతోష్, ఇప్పవెంకటేష్, సతీశ్, నరేష్ మర్రి ఐలయ్య, శివ ప్రసాద్, సీను, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.