బత్తుల ఆధ్వర్యంలో లక్ష మజ్జిగ పాకెట్ల పంపిణీ

రాజానగరం నియోజకవర్గంలో ఉన్న 3 మండలాల్లో గల 83 గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలు అలాగే ప్రధాన కూడళ్లలో రాజానగరం ఆర్టీసీ కాంప్లెక్స్, సీతానగరం ఆర్టీసీ కాంప్లెక్స్, కోరుకొండ ఆర్టీసీ కాంప్లెక్స్ లలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి భారీ స్థాయిలో 4 రోజులకి సుమారు లక్ష మజ్జిగ పాకెట్లను రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు పంపిణీ చేయడం జరిగింది. భారీ స్థాయిలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి రోజు సుమారు ఇరవై ఐదువేల మంది దాహర్తిని తీరుస్తుందని వర్షాలు పడే వరకు ప్రతీ రోజు ఈ కార్యక్రమం కొనసాగుతుందని బత్తుల తెలియజేసారు. ఈ కార్యక్రమం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేసి “జనసేన పార్టీ అధికారంలో లేకపోయినా భారీ స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తు, ప్రజలతో ఎప్పుడు మమేకం అయ్యి వారి కష్టాలను తెలుసుకుంటూ వారికి అండగా నిలబడింది అంటే అది ఒక్క జనసేన పార్టీ అని, బత్తుల బలరామకృష్ణ లాంటి నాయకుడిని మేము ఇంతక ముందు ఎన్నడూ చూడలేదని ఇలాంటి వారిని గెలిపించుకుంటామని జనసేన అంటే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని మరొక్కసారి నిరూపించిన బత్తుల దంపతులు ” అని తెలిపారు. ఈ సందర్బంగా బత్తుల మాట్లాడుతూ ఇంతటి మహోన్నతమైన కార్యక్రమం భారీ స్థాయిలో విజయవంతంగా ముందుకు సాగుతుంది అంటే దాని వెనుక వేల మంది జనసైనికుల శ్రమ, కష్టం ఉందని… జనసైనికులు ఇలానే ప్రజలకు అందుబాటులో ఉంటూ జనసేన పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ సత్తా చాటుదాం అని పిలుపునిచ్చారు.