జనసేనాని జన్మదిన వారోత్సవాలలో భాగంగా మొక్కల పంపిణీ

బొబ్బిలి నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలలో భాగంగా, 3వ రోజు జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాలలో ఒకటైన పర్యావరణ పరిరక్షణ సిద్ధాంతాన్ని పాటిస్తూ, సోమవారం బొబ్బిలి జనసైనికుల నిలయం వద్ద బాదం మొక్కల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో నాలుగు మండలాల అధ్యక్షులు, వీరమహిళలు, మండల నాయకులు, నియోజకవర్గ జనసైనికులు పాల్గొన్నారు.