భీమిలిలో ఘనంగా క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

భీమిలి నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు భీమిలి నియోజకవర్గం 1, 2, 3 వార్డు మరియు భీమిలి మండల క్రియాశీల సభ్యత్వ వాలంటీర్స్ సన్మానం మరియు కిట్స్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అప్పాల స్వామి ధన్యవాదములు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సందీప్ పంచకర్ల, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.