జనసేన ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ

వేమూరు, మహాశివరాత్రి సందర్భంగా ఉమ్మడి గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం, చుండూరు మండలం, మండూరు గ్రామంలో చుండూరు మండలం ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్ ఆధ్వర్యంలో మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా వింగ్ రీజినల్ కోఆర్డినేటర్ శ్రీమతి బి.పార్వతి నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి అనురాధ, ఐటి విభాగం కోఆర్డినేటర్స్ సి.హెచ్ కోటేష్ బాబు, అమర్తలూరు మండల అధ్యక్షులు ఎం.రమేష్, వేమూరు జనసేన నాయకులు శ్రీనివాసరావు, వేమూరు వీర మహిళా కె.లక్ష్మీ, హరి సుందరి, దేవిరెడ్డి సుబ్బయ్య, దేవిరెడ్డి బుల్లిబాబు, గోళ్ళ సాయి బాలాజీ, ఆత్మకూరి సురేష్, ఆదిలక్ష్మి, జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా క్రియశీలక సభ్యత్వం ప్రతి ఒక్కరు తీసుకోవాలని, 2024 ఎన్నికలలో జనసేన గెలుపుకి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శ్రీమతి పార్వతి నాయుడు విజ్ఞప్తి చేశారు.